మధుబని మాస్క్ లు తయారీకి శ్రీకారం చుట్టారు ఇహితా శ్రీశాంధియా .ఆమె మిథిలా స్మిత్ అనే సంస్థను స్థాపించి మధుబానీ కళను ప్రాచుర్యంలోకి తెచ్చారు .లాక్ డౌన్ కారణంగా చేతి వృత్తుల పై ఆధారపడిన వారి పరిస్థితి అగమ్య గోచరంగా ఉండటంతో ఉత్తరాది రాష్ట్రాలు వస్త్రాలకు వన్నెలద్దే మధుబానీ కళ పై ఆధారపడిన మహిళలు మాస్కుల తయారీలో శిక్షణ ఇప్పించారు .శాంధియా వారు తాయారు చేసిన మాస్కులు తక్కువ ధరకే ప్రజల కు అందించే ఏర్పాట్లు చేశారు .దానితో బీహార్ , జార్ఖండ్ మారుమూల ప్రాంతాల్లో ఉండే గ్రామీణ కార్మికులకు కష్టకాలంలో ఒక ఉపాధి దొరికింది .బీహార్ లోని జత్విక్ పూర్గ్ గ్రామానికి చెందిన ఉషా రేమంత్ మిశ్రా దంపతులు కూడా మధుబని కళ కోసం కృషి చేస్తున్నారు .చుట్టూ పక్కల గ్రామాల మహిళలలో మాస్క్ లపై కళాకృతులద్ది రూపొందిస్తూ దాని గొప్ప తనాన్ని ప్రజలకు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు .
Categories