ఈరోజు మహాశివరాత్రి శివుడు బోళాశంకరుడు, ఎవరెంత శివున్ని ప్రార్ధిస్తే వాళ్ళకు అంతగా కోరికలు తీరుస్తుంటాడు.కాగా శంకరుడు అంటేనే ఇతరులకు సుఖాన్ని కలిగించేవాడు అనే అర్ధం.పరమేశ్వరున్ని అష్టమూర్తి అంటారు. అంటే ఎనిమిది రూపాల్లో ఉంటాడాన్ని అర్ధం.పృధ్వీ,నీరు,ఆకాశం,తేజస్సు,వాయువు,సుర్యుడు,చంద్రుడు భక్తుడు ఈ ఎనిమిది ఆయన రూపాలే. శివ అంటే ఈశ్వరుడిని శివా అంటే శివపార్వతి అని అంటారు. ఈ శివ,పార్వతుల అనుగ్రహం కోసం ప్రార్ధించవల్సిన రాత్రిని శివరాత్రి అని శివునికి ఎంతో ప్రయోజనకరమైన రాత్రి అని రాత్రంతా శివస్థోత్రం,శివ కీర్తన,శివధ్యానంతో గడపాలని చెబుతారు.ఈ రాత్రి జాగారలో ఎవరికి వాళ్ళు ఆత్మపరిశీలన చేసుకుని జీవితాన్నో మార్చుకునే ప్రణాళికను చేసుకోవాలని విష్ణులు చెపుతారు. కోటి సూర్యుల తేజస్సుతో బ్రహ్మాడమంతా వ్యాపించిన ఆదిమూర్తిని అర్జించే రోజు ఇదే.
Categories