అన్ని రంగాల్లో మహిళలు ఎన్నో పరీక్షలు పాసై ఎంతో కష్టప్డి లక్ష్యాన్ని చేరుకుంటున్నారు.మొదటి భారత మహిళా అంపైర్ గా ఎంపిక కావడం వెనుక వృందారటి కృషి ఎంతో ఉంది. క్రికెట్ లో ప్రేమిమ్చి ఆ క్రీడనే కేరీర్ గా చేసుకోవాలనుకుంది ఆమె.మొదట్లో స్కోరర్ గా పని చేయాలనుకుని బీసీసీఐ నిర్వహించిన అర్హత పరీక్ష పాసైంది. తర్వాత వందలాది మ్యాచ్ లకు స్కోరర్ గా పని చేసింది. క్రీడాకారులు ఆడే ప్రతి బంతిని లెక్కలేయాలనుకుంది. న్యూజీలాండ్ కి చెందిన అంపైర్ కేతీ క్రాస్ ను చూశాక వృందా ఆ వైపుగా తన కెరీర్ ను మార్చుకుంది. ఎన్నో పరీక్షలు రాసింది. 150 మ్యాచ్ లకు పని చేసింది.ఈ మహిళా అంపైర్ అమ్మాయిలకు స్పూర్తి కదా.