నీహారికా,

కొంతకాలం స్నేహం చేసాక, ఒక చదువు పెరిగాక కాఠినంగా మాట్లాడినా, విమర్శించినా అదో విషయం కాదు, స్నేహితుల మద్యని బాంధవ్యం దెబ్బతినడు అనుకుంటారు కానీ నిజాయితీగా ఫీడ్ బ్యాక్ ఇచ్చుకొన్నా సరే, ఒక్క సారి కఠిన పదం కుడా భాంధవ్యాన్ని బలహీనం చేయవచ్చు. కావాలని విమర్సించక పోయినా ఎదుటి మనిషి దీన్ని సీరియస్ గా తీసుకునే అవకాశం వుంటుంది. అంటే దేనికైనా ఒక గీత వుండాలి. ఆ గీతను ఎంతటి సన్నిహితులైనా దాటకూడదు. భార్యా భర్తలు, సోదరీ సోదరులు చివరకు తల్లి బిడ్డలైన సరే మనసుకి చురుగ్గా తాకే మాటని ఓర్చుకోవాలి. అంచేత ఎంత స్నేహితుల మధ్యనైన మాటలు మృదువుగా పూల బెండు లాగా వుండాలి. అవతలి మనిషికి మాట పువ్వులాగే అందాలి కానీ ముల్లుల్లా తాకకూడదు. ఇద్దరు స్నేహితులు ఇప్పుడు ఒక్కళ్ళనోక్కళ్ళు విమర్సిన్చుకోవడం తప్పుపట్టడం, మనకే ఎక్కువ తెలుసునన్న ధోరణి లో మాట్లాడుకోవడం తగదు. ఏ అనుభందాన్ని అయినా ఒక చిన్ని ప్రమిడలో దీపాన్ని గాలికి రెపరెప లాడకుండా రెండు చేతులు అడ్డుపెట్టినట్లు కాపాడుకోవాలి. స్నేహ మాదుర్యాన్ని అనుభవించాలి. జీవితం అంటే అవకాశం ఇస్తుంది.

Leave a comment