షరార డ్రెస్ పాత సినిమాల ట్రెండ్. ఎన్నో సంవత్సరాల తర్వాత మళ్ళీ అదే డ్రెస్ ట్రెండ్ క్రియేట్ చేస్తుంది. పెళ్లి కూతుళ్ళు, యువతులు ఈ ఫ్యాషన్ అవుట్ ఫిట్ వైపు ఇష్టంగా చూస్తున్నారు. స్పెషల్ గా, ట్రెండీగా ఈవెంట్స్ లో ధరిస్తే స్పెషల్ ఎట్రాక్షన్ గా వుండటంలో ఇది పాతకాలపు డ్రెస్ అన్న పదం పక్కన పెట్టి ఇందులో వస్త్ర శ్రేణిని మాత్రం మార్చిపారేసి కొత్త లుక్ తీసుకొస్తున్నారు ఫ్యాషన్ డిజైనర్స్. చూసేందుకు ట్రౌజర్ ల కనిపిస్తుంది బాటమ్ డిఫరెంట్ గా పరికిణీలా లూజుగా బావుంటుంది. ప్రెట్టీ లుక్ తో స్లిమ్ గా కనిపించటం ఖాయం. ఇవి చోళీ, కుర్తాలతో కలపీ బావుంటాయి. బ్లవుజ్, బాటమ్ కలిపినా ఫ్యాషన్. ఎక్కువ ఎంబ్రాయిడరీ పనితనం లేకుండా, లేత రంగుల్లో చక్కని గ్రాండ్ లుక్ తో పెళ్లి వేడుకలు, ఇతర ప్రత్యేక కార్యక్రమాల్లో అమ్మాయిలు ఇది బెస్ట్ ఆప్షన్ అంటున్నారు. అందుకే ఏనాడో పాత కాలపు ఫ్యాషన్ మళ్ళీ ఇవాల్టి యూత్ ఫ్యాషన్ అయింది.

Leave a comment