“శివ ప్రసాదం”
శివుడు తాండవము చేయునమ్మ…కైలాస గిరిపై
అవిరళ ముగ జగదాంబ ముందర!!
శివారాధనకు సోమవారం అత్యంత శక్తివంతమైనది.త్రి సంధ్యా నటుడైన భోళాశంకరుడు వాహనమైన నందీశ్వరునిపై ప్రదోష కాలంలో లోక సంచారానికి బయలుదేరుతారు కావున ప్రదోషవేళ పూజకి ప్రాధాన్యత.శివన్నకు పాలు, పంచామృతాల అభిషేకం, విభూతి అలంకారణ ఆనందం. తెల్లని తామరలతో పూజించిన అద్భుతమైన ఙ్ఞాన సంపద,బిల్వపత్రంతో ఐశ్వర్యం,మందారపూలతో పూజిస్తే అన్నోన్య దాంపత్య జీవితం లభిస్తుంది. సంపంగి, ,పారిజాతం,తులసి మొగలి అనివార్యం. నిత్య ప్రసాదం: కొబ్బరి,ఎండుద్రాక్ష, పాయసం. సోమవారం దద్ధోజనం అత్యంత ఇష్టం.
పాయసం తయారీ: పాలను మరిగించాలి, ముందు రోజు రాత్రి నానబెట్టిన సగ్గుబియ్యం వేసి, తగిన చక్కెర,యలకపొడి వేయాలి.
దద్ధోజనం తయారీ: ముందుగ ఉడికించిన అన్నం చల్లారిన తర్వాత గట్టి పెరుగు, తగినంత ఉప్పు వేసి, ఆవాలు,మిరపకాయలు, నేతి లో వేసి పోపు పెట్టుకోవాలి. వందే శంభుం ఉమా పతిం అని పూజిద్దాం పదండి.
-తోలేటి వెంకట శిరీష