కొన్ని లోకోక్తులు చెప్పదలచుకొన్న విషయానికి అదనపు బలాన్ని ఇస్తాయి. అమర్చిన దాంట్లో అత్తగారు వేలు పెట్టిందిట అలా వుంది అంటారు. అత్తగారు చిన్నం ఎత్తు పని చేయదు. కోడలు వండి అమర్చితే ఆవిడ వేలు పెట్టి నేను కూడా సాయం చేశా అంటోంది. చాలా మంది ఇంతే కష్టం ఒకళ్ళు చేస్తారు,ఫలితం దగ్గరకు వచ్చే సరికి దాన్ని ఎవరో వోళ్ళు వంచని వాళ్ళ సొంతం చేసుకొంటారని చెప్పేందుకు గాను ఈ సామెత ఉపయోగిస్తారు.
* తాను పెట్టదు,తెచ్చుకు తిననివ్వదు.
* అమ్మ పెట్టి నాలుగు పెడితే గానీ.
* అమ్మబోతే అడవి,కొనబోతే కొరివి.
* అయ్యవారు రాకుంటే అమావాస్య ఆగుతుందా ?
సేకరణ
సి.సుజాత