గ్లోబల్ ఇంటర్నెట్ ప్లాట్ ఫాం జండర్ పాలసీ వంద మంది అత్యంత ప్రభావశీలురైన వారి జాబితా వెల్లడించింది. వీరిలో రంజినా కమారి వారణాసిలో జన్మించారు. ఎన్నో ఏళ్ళు గా దక్షిణాసియాలో మహిల సాధికారిత కోసం కృషి చేస్తున్నారు. అలాగే శృతి కపూర్ కాన్పూర్ లో జన్మించారు. సేప్టీ ఫౌండేషన్ ద్వారా మహిళలకు చట్టాలు,న్యాయపరమైన హక్కులపై అవగాహన కల్సిస్తుంది.వీరిద్దరూ కాకుండా మరో ఐదుగురు ప్రవాస భారతీయ మహిళలున్నారు వీరు రూపారత్, నైలా కబీర్, కవితా రామ్ దాస్,గీతారావ్ గుప్తా ,పూర్ణ సేన్ .మహిళలపై హింస లేపి సమాజం చూడాలని రంజనా కుమారి కోరుకున్నట్లే మిగతా వాళ్ళు కూడా మహిళా సాధికారిత కోసం కృషి చేస్తున్నా వాళ్ళే.