నీహారికా,
మనల్ని మనం ప్రేమించుకోవాలా? మన ఆలోచనలు ఇష్టాలు అన్నీ సరైనవే. మనం ప్రత్యేకమైన వాళ్ళం అనుకోవాటం అవసరం. మన పట్ల మనకు ప్రేమ గౌరవం ఉంటేనే ఏదైనా సాధించగలుగుతాం. ప్రేమ అన్నది ఫీలింగ్ కాదు ఒక శక్తి. ఎటువంటి షరతులు లేకుండా ఎవర్ని వారు ప్రేమించుకుంటే మన లో ఇగో తో మనం ఫైట్ చేసుకోవాల్సిన పని లేదు. ఇగో విడదీయరానివి. అటువంటి ప్రేమ లేనప్పుడు మనకు మనం ఫైట్ చేయాల్సిన పని లేదు. ఇది ఆత్మస్థయిర్యానికి అత్యవసర పదార్ధం. న్యాయం, ప్రేమ ఏమీ చేసుకోలేక పోతాం. అర్ధం లేని భయాలుసంశయాలు వెన్నోడతాయి. ఇవి వున్నప్పుడు జీవితం దుర్భరంగా కనిపిస్తుంది. మన పై మనకు గల ప్రేమ ఆశను పెంచుతుంది. ఆశ జీవితంలో సజావుగా సాగటానికి ఆక్సిజన్ వంటిది. మనల్ని మనం ప్రేమించుకోవాలి. అలాగే మన ఆలోచనలు, అభిప్రాయాలు నిస్పక్షపాతం గా సమీక్షించుకుని అన్ని విధాలా మనం లోపం లేకుండా వున్నామో లేదో గమనించుకుని అప్పుడు మన నిర్ణయాలపై మనం గట్టిగా నిలబడితే సక్సస్ సాధించినట్లు.