పిల్లలు లాక్ డౌన్ సమయంలో రోజంతా ఇంట్లో ఉండలేక,బయట కాసేపు ఆడుకొనే అవకాశం లేదు,పెద్దవాళ్ళని చాలా విసిగిస్తారు. ముఖ్యంగా మొబైల్ వదలనంటారు పెద్దవాళ్ళు వాళ్ళని కొంత సమయం,టివి,మొబైల్స్ తో గడపవద్దు అంటారు. ఇలా చెప్పేందుకు పెద్దవాళ్ళు కూడా దాన్ని పాటించి తీరాలి. తల్లితండ్రులు నిరంతరం ఫోన్ లోనే ఉంటూ పిల్లలను చూడవద్దంటే వాళ్ళు ఎందుకు వినాలి. ముందుగా వాళ్ళు చేయవలసిన పని పూర్తి చేస్తేనే, చదువుకోవటం,స్నానం చేయటం మొదలైనవి పూర్తి చేస్తేనే కాసేపు ఫోన్ చుడనిస్తాను అని చెప్పేయాలి. అంతే కానీ దాన్ని ఆడుకొనేందుకు ఇవ్వరాదు అని నిబంధన పాటించేలా జాగ్రత్త తీసుకొంటే పిల్లలు తెలుసుకొని నడుచుకొంటారు. వారి ఇష్టాలు,ఆటలు,చదువు అన్నింటికీ స్కూలు టైం టేబుల్ లాగా కొంత సమయం కేటాయించాలి.

Leave a comment