Categories

రోజుకు అరగంట అయినా మనసారా నవ్వితే రోగనిరోధక శక్తి పెరుగుతుంది అంటున్నారు పరిశోధికులు. కామెడీ సినిమాలు చూసైనా సరే నవ్వాలి. తరుచుగా నవ్వే వారికి గుండె జబ్బులు వచ్చే అవకాశం తక్కువట. రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుందట. నవ్వటం వల్ల ఊపిరి తిత్తులు సామర్థ్యం రక్తంలో ఆక్సిజన్ స్థాయిలు పెరుగుతాయి. మైగ్రైన్ వంటి సమస్యలు రావు. ముక్కు శ్వాస కోశాల లోని పొరలు నాళాలు ఆరోగ్యంగా ఉంటాయి. నవ్వటం వల్ల ఒత్తిడి కూడా మాయమైపోతుంది.