మనకి చాలామంది పైన ఇష్టం ఉంటుంది గౌరవం ఉంటుంది. ఇప్పుడు దాన్ని ఎక్సప్రెస్ చేసే పద్ధతులు చాలా వచ్చాయి. పర్సనలైజ్ గిఫ్టులు చూడండి. ఒక త్రీడీ క్రిస్టల్ క్యూబ్ లో మనం ఇష్టపడే వ్యక్తి బొమ్మ చేస్తారు. ఇలాంటి కస్టమైజ్డ్ పర్సనలైజ్డ్ బహుమతుల నమూనాలని ఎన్నో సైట్స్ లో ఇమేజ్లను చూడచ్చు. మనం ఇవ్వాలనుకున్న బహుమతులు నచ్చిన డిజైన్ అందులో రాయవలిసిన కొటేషన్ ఫోటోని ఇస్తే చాలు. దాన్ని అలాగే ముద్రించి ఇచ్చేస్తారు . ఒక ఈవెంట్ కూడా ప్లాన్ చేయచ్చు. మనింట్లో బాబుంటే వారి ప్రతి పుట్టిన రోజున ఒక ఫోటోని కష్టమైజ్ చేయించి ఇంకో పన్నెండు నెలల తర్వాత ప్రతి నేలలోను అద్భుతంగ తీయించిన ఫొటోలతో ఒక క్యాలెండర్ ప్రింట్ చేయించవచ్చు. పిల్లవాడి మొదటి సంవత్సరపు పుట్టిన రోజున వచ్చిన మనకు ఆప్తులైన వారికీ మాత్రమే ఈ క్యాలెండర్ ఇవ్వాలి. సుమా .. ఎందుకంటే మనం ఆప్యాయంగా దాచుకున్న అనుభూతుల్ని అంత ఆప్యాయంగా ఇష్టపడేవాళ్ళకే కదా ఇవ్వాల్సింది. ఇప్పుడు ఫోన్ లు ట్యాబ్ లాప్ టాప్ వెనక కూడా అంటించే స్టికర్లు ఇప్పుడన్నీ పర్సనలైజ్డ్ బహుమతులే.
Categories