అభిరుచి ఉండాలే కానీ వయసుతో సంబంధం లేదని నిరూపించారు వహీదా రెహెమాన్. ఈ సుప్రసిద్ధ సినీనటి తన 81వ ఏట కెమెరా పెట్టుకొని వైల్డ్ లైఫ్ ఫొటో గ్రఫీ లో బిజీ అయ్యారు. ఇండియా,టాంజానియా,నమీబియా,కెన్య అడవుల్లో ఎన్నో ఫోటోలు తీశారు తానుతీసిన ఫోటోల తో ఒక ఎగ్జిబిషన్ నిర్వహించారు చిన్నపుటి నుంచి నాకు ఫోటోగ్రఫీ ఇష్టం. ఒక ఫోటో ఎగ్జిబిషన్ లో ఆర్ట్ క్యూరేటర్ హిమాంశు షెథ్ ను కలిశాను. నా హాబీ గురించి చెపితే హాయిగా వెళ్ళి ఫోటోలు తీయండి ఎగ్జిబిషన్ ఏర్పాటు చేద్దాం అన్నారు. అనాటి ఇష్టాన్ని పైకితీసి కెమెరా పట్టుకున్న. అలా వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ అయ్యా అన్నారు వహీదా రెహెమాన్.

Leave a comment