Categories
సంతకాన్ని బట్టి వ్యక్తిత్వం అంచనా వేయచ్చు అంటున్నారు గ్రాఫాలజిస్ట్ లు . సిగ్నేచర్ పైకి ఉన్నట్లయితే వాళ్ళు దైర్యవంతులట , సిగ్నేచర్ అక్షరాల మధ్య గ్యాప్ ఉండే వాళ్ళు ఆరంభకూరులట ,వీరికి మంచి ఐడియాలు ఉంటాయి . కానీ ఆచరణ లో విఫలం అవుతారు . సిగ్నేచర్ లో డాట్స్ ఉపయోగిస్తే వాళ్ళు ఎవరేమనుకున్నా నాకు లెక్కలేదు అనే లైఫ్ మనిషులు . సంతకం చేసి గీతను వెనక్కి లాగి పెట్టేవాళ్ళు వర్తమానం కన్నా గతం గురించి ఆలోచిస్తారు . సంతకం మొదటి అక్షరం పెద్దదిగా పెట్టేవాళ్ళు నాయకత్వ లక్షణాలు ఉంటాయి . సంతకం చేస్తూ దాన్ని పైపైకి తీసుకుపోతే వాళ్ళు చాలా షార్ప్ . సానుకూల దృక్పధం తో ఉంటారు .