Categories

ఈ వేసవి ఎండలకు నీరసం వచ్చేస్తూ ఉంటుంది. కళ్ళు తిరిగి బలహీనంగా ఉన్నట్లు అనిపిస్తే కొన్ని చిట్కాలతో బయటపడవచ్చు . మెదటి సూత్రంగా సమయానికి ఆహారం తీసుకొవాలి.అలాగే నీళ్ళు తప్పనిసరిగా తాగాలి. శరీరానికి కాస్త విశ్రాంతి కూడా కావాలి. ప్రతి రోజు మజ్జిగలో గులాబి రేకులు ముద్దగా చేసి కలిపి చక్కెర కూడా కలిపి తీసుకోవాలి. నల్ల ద్రాక్ష రసం కూడా మంచిదే అంటారు డాక్షర్లు. నీళ్ళలో అల్లరసం,నిమ్మరసం తేనె కలిపి చల్లని జ్యూస్ ను రెండు సార్లు తాగవచ్చు. ఎండ వేడిని తట్టుకొనెందుకు పల్చని మజ్జిగలో అల్లం ముక్కలు నిమ్మరసం ,ఉప్పు కలిపి తాగాలి.పగలంతా పని చేసి రాత్రి వేళ విశ్రాంతిగా నిద్రపోవాలి. మంచి భోజనం, కాస్త విశ్రాంతి,నీళ్ళు తాగటం ఇవన్ని ఈ వేసవిలో తప్పకుండా చేయవలసిన పనులు.