Categories
పేరు డబ్బు కెరీర్ లో పైపైకి దూసుకుపోతుంటే వాళ్ళని అదృష్టవంతులనే పేరుతో పిలుస్తూ ఉంటాం. నిజానికి మనం చేసే కష్టమే అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది. సినిమా నటులు ఇలాగె ఎంతో కష్టం చేస్తారు రిస్క్ లు తీసుకుంటారు. గంటల రోజుల కొద్దీ జిమ్ లలో చెమటలు కారుస్తారు. నీరజ్ పాండే యాక్షన్ థ్రిల్లర్ బేబీ సినిమా కోసం తాప్సీ కొన్ని స్టంట్లు చేయాలి. ఇందుకోసం తాప్సీ సీరియస్ గా మార్షల్ ఆర్ట్స్ లో శిక్షణ తీసుకుంటుంది. సిరిల్ రేఫల్లీ బాగా పేరు పొందిన ఆర్టిస్ట్. అనేక హాలీవుడ్ హిట్స్ లో పని చేసాడు. అలాంటి స్టంట్ మాన్ దగ్గర తాప్సీ శిక్షణ తీసుకుంటుంది. సుకుమారుల్లా అనిపిస్తారు. కానీ ఎవళ్ళూ కష్టానికి భయపడరు. అలాగుంటేనే అదృష్టవంతులవుతారు.