వారణాసి నగరం చుట్టూ అల్లిన కథ మాసాన్ (Masaan) దేవి తన బాయ్ ఫ్రెండ్ తో ఒక హోటల్ లో పోలీసులకు పట్టుబడుతుంది అవమానంతో అతను ఆత్మహత్య చేసుకుంటాడు.తనకు మూడు లక్షలు ఇస్తే కేస్ వదిలేస్తానని దేవి తండ్రితో పోలీస్ ఇన్ స్పెక్టర్ భేరం  ఆడుతాడు. ఇంకోవైపు హరిశ్చంద్ర ఘాట్ లో శవదహనం చేసే కుటుంబంలో పుట్టిన దీపక్ శాలు గుప్తా అనే అమ్మాయిని ప్రేమిస్తాడు. కానీ అతన్ని వివాహం చేసుకునేందుకు ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరని చెబుతుంది శాలు. కుటుంబంతో యాత్రలకు వెళ్ళిన శైలు ప్రమాదంలో అందరూ చనిపోతారు. శవ దహనం  చేస్తూ దీపక్ శైలు ని గుర్తు పడతాడు.ఈ జ్ఞాపకాలతో గంగానదీ తీరం వద్ద కు వచ్చిన దీపక్ అక్కడ దేవి ని చూస్తాడు ఇద్దరి అనుభవాలను గంగానదిలో కలిపేసి కొత్త జీవితం కోసం వెళ్లేందుకు పడవ ఎక్కుతారు ఇద్దరు. బహుశా ఈ ఇద్దరు కలిసి కూడా కొత్త జీవితం సాధించవచ్చేమో దర్శకుడు నీరజ్ ఘైవాన్, రచయిత వరుణ్ గ్రోవర్.

రవిచంద్ర.సి
7093440630

Leave a comment