హేండ్ బ్యాగ్లో తప్పనిసరిగా ఉండవలసిన వస్తువుల్లో సోప్ పెటల్స్ ని చేర్చండి అంటున్నారు ఎక్స్ పర్డ్స్ . చిన్ని బాక్స్ లో చక్కని సువాసనతో ఉండే ఈ  సోప్ పెటల్స్అవసరం అయితే ఒక్కో రెక్క బయటికి తీసి నీళ్ళలో తడిపితే సబ్బు నూగారు వస్తుంది . అవసరం అయితే ఇవి చిన్ని సబ్బుముక్క చేతిలో ఉన్నట్లు ఉపయోగ పడతాయి . నిజానికి సబ్బుని తడిపామంటే మల్లి బ్యాగ్ లో పడేయటం చాల ఇబ్బంది . ఈ  సోప్ పెటల్స్ లో ఇబ్బంది ఉండదు . పరిమళాలు వెదజల్లే ఈ పూల రెక్కల టేబుల్ పైన చిన్ని బాక్స్ లో పోసి ఉంచినా అందంగా కనబడుతూ సువాసన నింపుతాయి . ప్రయాణాల్లో సబ్బు బదులు ఈ  సోప్ పెటల్స్ తీసుకుపోవటం సౌకర్యం .

Leave a comment