Categories
వంటిల్లే ఒక ఔషధాల గని అంటున్నారు ఎక్సపర్ట్స్. సాదా సీదాగా కనిపించే పోపు దినుసులో మసాలాలు సంపూర్ణ ఆరోగ్యానికి మేలు చేస్తాయంటున్నారు .ఆధునికత పెరిగింది జీవన శైలి మారింది ,ఆరోగ్య సమస్యలు పెరుగుతున్నాయి. అన్నింటికికాకపోయినా కొన్ని సమస్యలకు మసాలా దినుసులే ఔషధాలుగా ఉపయోగ పడుతాయి. శరీరంలో పేరుకుపోయిన కొవ్వు అధిక బరువును తగ్గించగలుగుతాయి. లవంగాలు, దాల్చిన చెక్క, గసగసాలు, బిర్యానీ ఆకు అనాస పూవు వంటి మసాలా దినుసులు జీర్ణ క్రియలు సక్రమంగా జరగటానికి ఎంతో ఉపయోగ పడుతాయి. వికారం,ఆకలి మందగించటం వంటివి వేధిస్తే,ఆహారం లో మసాలాలు చేర్చుకుంటే మంచిదంటున్నారు పోషకాహార నిపుణులు.