Categories
ఎండ ,కాలుష్యం వంటి ఎన్నో కారణాలతో మొహాం పైన మచ్చలు పడుతూ ఉంటాయి . ఈ నల్లమచ్చలు పోగొట్టాలంటే సహజమైన ఎన్నో వస్తువులు ప్రకృతిసిద్ధంగానే ఉన్నాయి . పచ్చికొబ్బరి గుజ్జుని మొహానికి పట్టించి ఓ అరగంట పాటు అలా వదిలేసి ముఖం శుభ్రం చేసుకొంటే ఈ మచ్చలు క్రమంగా పోతాయి . ఇది ప్రతిరోజూ చేయాలి . బంగాళాదుంప గుజ్జులో గులాబీ నీరు కలపి కాస్త తేనె కలపి ఈ మిశ్రమంతో పేస్ మాస్క్ వేసుకొని ఆరిపోయాక కడిగేస్తే ముఖం పైన మచ్చలు కనబడకుండా పోతాయి . అలాగే బొప్పాయి పేస్ట్ కూడా ఎంతో బాగా మచ్చలను తగ్గించ గలుగుతుంది . నిమ్మరసం,తేనె,చక్కర కలసిన మిశ్రమం కూడా నల్ల మచ్చలను మాయం చేస్తుంది .