కరోనా సమయంలో ప్రజలకు తన వంతు సాయంగా మాస్క్ లు కుట్టి ఇవ్వటం ప్రారంభించారు రంగ రెడ్డి జిల్లా కొత్త పల్లి ఎం.పి.టిసి సభ్యురాలు శోభ సుధాకర్ రెడ్డి. మాస్క్ ల కొరత తీవ్రంగా ఉండటంతో ఆమె వాటిని సొంతంగా కుట్టటం ప్రారంభించారు. వీటి తయారీ కోసం తన కొత్త కాటన్ చీరెలు వినియోగిస్తూ రోజుకు దాదాపు 200 వరకు మాస్క్ లు తయారు చేస్తున్నారు. వీటిని గ్రామప్రజలకు ఉచితంగా అందజేస్తూ వ్యాధి పట్ల వారిలో అవగాహనా కల్గిస్తున్నారు శోభ.

Leave a comment