వర్షపు జల్లు పడితే ఎంత అందమైన డ్రెస్ అయినా మెయింటెయిన్ చేయటం చాలా కష్టం. కాకపోతే వర్షా కాలం డ్రెస్ కోడ్ కాస్త మార్చాలి. మోకాలి పొడవు ఉండే ట్రౌజర్స్ లేదా కాళ్ళ పొడవుతో కట్ ఉంది స్కర్ట్ లా కనిపించే కులాట్స్, మిడీ, టీ షర్టులు వేసుకుంటే సౌకర్యంగా వుంటుంది. హై నాట్ మ్యాక్సీ డ్రెస్ లు కూడా బావుంటాయి. అలాగే హై హీల్ షూస్ కు బదులు స్టాప్స్ ఉన్న శాండిల్స్ లేదా ఫంకీ రబ్బర్ ఫ్లిప్ ఫ్లాప్స్, గ్లాడియేటర్ శాండిల్స్ వాడుకుంటే వర్షాకాలం సౌకర్యంగా ఉంటాయి. ఓ బ్యాగ్ లో ఓ చిన్న గొడుగు వుండాలి. వెరైటీ డిజైన్లు, వివిధ రంగుల్లో ఉండే గొడుగును సెలెక్ట్ చేసుకుంటే స్టయిల్ గా వుంటుంది. వర్షంలో తడిసిన వెంటనే ఆరిపోయే నైలాన్, సిల్క్, సింథటిక్, బ్లేండీ కాటన్ బట్టలు వేసుకోవాలి. భారీ మేకప్ వద్దు. మెటల్ జ్యువెలరీ వర్షంలో తడిస్తే పాడయిపోతుంది కనుక చిన్న బంగారు గొలుసే బాగుంటుంది. డెనిమ్ ఫ్యాషన్స్ కు ఈ వర్షాకాలం అసలు కుదరదు. వర్షంలో తడవని బ్యాగులు, ఫోన్ కవర్లు తీసుకుంటే ఈ సీజన్ సుఖంగా నడుస్తుంది.
Categories