కొందరి పిల్లలకు ఎక్కువ మాటలు వచ్చాయి అంటే ఇంట్లో పెద్దవాళ్ళు పిల్లలతో కబుర్లు చెపుతున్నారు అని అర్థం చేసుకోవాలి అంటున్నారు ఎక్స్ పర్ట్స్. పిల్లలు ఎక్కువ మాటలు వింటే ఎక్కువ వస్తాయి. ఇంట్లో వాళ్ళు పసి పిల్లలను తరుచు మాట్లాడించాలి. ఇది సెల్ ఫోన్ ల యుగం కనుక పిల్లల అల్లరిని అరికట్టేందుకు వాళ్ళ చేతుల్లో ఒక ట్యాబ్ పెట్టేసి ఊరుకుంటున్నారు. ఆటలు , మాటలు అందులోనే వినాలి. అంతే కాదు అత్తా, తాతా అని పనిగట్టుకొని పిల్లలకు నేర్పించే అలవాటే పోతుంది. పిల్లలతో తల్లిదండ్రులు ఎంత బాగా మాట్లాడితే వాళ్ళ మెదడు పెరుగుదల అంత బావుంటుందట. వాళ్ళతో మాట్లాడుతూ ఉంటే భాష, పదాల ఉచ్చారణ అర్థం చేసుకొనే శక్తి త్వరగా పట్టుబడతాయి. వాళ్ళకి వస్తువులు చూపిస్తూ అదేమిటో చెపుతూ నేర్పించండి. పిల్లలు వెంటనే నేర్చుకొంటారు అంటున్నారు ఎక్స్ పర్ట్స్.
Categories