నీహారికా,

ఇది అడగాల్సిన ప్రస్నే. ఇప్పుడు కొత్త సంవత్సరం రేపు సంక్రాంతి ఇంకో రోజు ఉగాది. ఎప్పుడూ ఆత్మేయులకు మన చుటూ  వుండే వాళ్లకు ఇవ్వగలిగే అమూల్యమైన బహుమతి ఎముంటుందీ అన్నావ్. ‘మాట ‘……. అవును మాటే మంత్రం. ఎన్ని మాటలున్నాయిరా ! బావుంది. అరే  చక్కగా వుంది. క్షమించండి కృతజ్ఞతలు సుమీ ,థాంక్స్ అండీ, సారీ బాబూ  అందించే బహుమానాలు. ఇవి నీకెందరినో స్నేహితులను బహుమతిగా ఇస్తాయి. ప్రతి నిమిషం నీ జీవితంలో శిరస్సు పైన నవ్వులు పువ్వులు పారిజాతాల్లా పున్నాగల్లా రాలుతూనే ఉంటాయి. ఎప్పుడూ ఇలా పాజిటివ్ గా ఉండటం కష్టం. కానీ అసాధ్యం కాదు. నెగిటివ్ మాటలు మాట్లాడిన ప్రతీ సారీ గమనించుకో మన శరీరం తీరుమారి పోతుంది. పరుషమైన వాక్కులతో అవతలి మనిషి మోహంలో వెంటనే ఎదురు దెబ్బ తీయాలనే ఉద్రేకం కనిపిస్తుంది. అదే పాజిటివ్ గా ప్లీజ్ అంటే అసలు వాతావరణమే మారిపోతుంది. ఆంగ్ల భాషలు అత్యంత శక్తిమంతమైన పదం ప్లీజ్ అని తేల్చారు. సైకాలజిస్టులు. అందుకే ప్రతి పండగకేమిటి ప్రతీ సారీ ఒక అద్భుతమైన పదాన్నే కానుకగా ఇవివి నీహారికా…. ఇదే చక్కని వరాలిచ్చే మంత్రం. మంచి మాటకున్న  శక్తినే మంత్రం అంటారు. అందరూ బావుండాలి. ఇదే అసలు సిసలు విలువైన గిఫ్ట్. ఏమంటావూ ??

Leave a comment