నగలంటే ఖరీదైన వజ్రవైడుర్యాలే కానక్కరలేదు. అందంగా కనబడే బేస్ ఏదయినా పర్లేదు. బంగారం రంగులో, రత్నాలతో టెర్రికోట్ మట్టినగలు కూడా వయస్సు తో నిమిత్తం లేకుండా అన్ని వయస్సుల వాళ్ళకీ ఆకర్షణగా నిలుస్తున్నాయి. అప్పట్లో గిరిజన తెగలలోనే వీటి వాడకం. ఎధ్నిక్ ప్రియిల పుణ్యమా అని సోషల్ మీడియాలో పరుగులు తీసి ప్రపంచ వ్యాప్తంగా ఫ్యాషన్ ప్రియుల మేడల్లో అమిరాయి. నదులు, సముద్రాల్లో దొరికే బంకమట్టి ఈ నగలకు ఆధారం. ఈ నగల తయ్యారీలో నిపుణులు వీటికి ఆకర్షణీయమైన రంగులు అద్ది నెక్లెస్లు, జుంకీలు, గాజులు తయారు చేస్తున్నారు. ఇది చూసేందుకు ట్రెండీగా పెద్దవిగా ఉంటాయి. అసలు బరువు వుండవు. చక్కని నేత చీరల పైకొ, చుడీదార్ వేసుకొనే ఈ టెర్రికోట్ నగలు పెట్టుకుంటే, ఖరీదైన వజ్రాలు, ముత్యాలు ఇవ్వలేని అందం ఇస్తాయి. ఈ టెర్రీకోట్ మట్టి నగలు. సరదాగా విండో షాపింగ్ చేసేయండి.

Leave a comment