Categories
రాత్రివేళ పడుకునే ముందర గ్లాసుడు పాలు తాగే అలవాటు చేసుకోమంటున్నారు ఎక్స్ పర్ట్స్. ఇది ప్రాచీన కాలపు సూత్రమే కానీ బాగా నిద్రపోయేందుకు ఇది ఔషధం లాగా పనిచేస్తుందని చెబుతున్నారు. రాత్రివేళ తీసుకున్న పాలు ఒత్తిడీ, ఆందోళన ను తగ్గిస్తాయిన్నారు. పాలల్లో ఉండే ట్రిష్టోఫాన్ అనే ప్రోటీన్ మనస్సుకు ఆహ్లాదం ఇచ్చే సెరటోనిన్ విడుదలకు తోడ్పడుతుందని,ఈ సెరటోనిన్ జీవ గడియారాన్ని నియంత్రిస్తూ నిద్ర కు కారణం అయ్యే మెలటోనిన్ హార్మోన్ ను విడుదల చేస్తుందని ఆ కారణం వల్లనే పాలు తాగితే హాయిగా నిద్ర వస్తుందని చెబుతున్నారు.