Categories
రోజు ధ్యానం చేయటం వల్ల ఆలోచనా స్థాయి పెరుగు తుందనీ,నిర్ణయాలు తీసుకోవటంతో సమర్ధవంతంగా పని చేస్తారనీ అవగాహనా శక్తి పెరుగుతుందనీ చెపుతున్నారు ధ్యానం తో అవసరమైన ఒత్తిడి తగ్గుతోంది. ఎక్కువ ఒత్తిడి అనారోగ్యాన్ని తెచ్చిపెడుతోంది. దీన్ని ఎదురుక్కొనేందుకు ధ్యానం తప్పనిసరి. ఇతర నైపుణ్యాల మాదిరిగానే ధ్యానం ఒక నైపుణ్యం. ప్రాక్టీస్,ఏకాగ్రత తో ఇది పెరుగుతుంది. కోపం,భాద విషాధం వంటి భావోద్వేగాలను వ్యక్త పరిచే సమయంలో నియంత్రణ ఉండాలంటే అది ధ్యానం తోనే సాధ్యం. ధ్యానం తో రోగనిరోధక శక్తి బలోపేతమై ఆరోగ్యవంతమైన జీవితం గడిపే అవకాశం వస్తుంది.