కూరలకు చెక్కని రంగు ఇవ్వగలదీ, యంటి బయోటిక్ గా పని చేసేది, అన్ని అనారోగ్యాలను మాయం చేసేది, ముఖ్యంగా పూజల్లో అగ్ర స్థానం లో వున్నది. ఏమిటీ అంటే పసుపు. మూడు అక్షరాల పసుపులో వుండే కర్కుమిన్ అనే పదార్దంలో ఎన్నో ఔషదాల్లో కీలకం. క్యాలరీలు పుష్కలంగా వుండేది. పీచు కలిగి వుండేది, పసుపులో వుండే గుణాల తో పుస్తకం రాయొచ్చు. అన్నింటికంటే ముఖ్యం ఇది సౌందర్య రక్షణ లో పసుపు పాత్ర అంతా ఇంతా కాదు. ఇనుము, పోటాషియం, మాంగనీస్, విటమిన్స్ ఇందులో వున్నాయి. విటమిన్-ఇ కంటే 8 రెట్లు శక్తివంతమైనది. శరీరంలో వుండే అధిక కొవ్వును కరిగించే బైల్ రసం ఉత్పత్తిని మెరుగు పరిచే గుణం పసుపుకుంది. ఇది బరువుని నియంత్రించడం తో పాటు ఓబిసిటీ సంబందిత వ్యాధులను నియంత్రణలో ఉంచుతుంది. ప్రతి రోజు పసుపు టీ తాగడం వల్ల జీవిత కాలం పెరుగుటుంది. ప్రతి రోజు పసుపు టీ తాగడం వల్ల జీవిత కాలం పెరుగుతుంది.నాలుగు కప్పుల నీళ్ళల్లో టీ స్పూన్ పసుపు వేసి మరగనిచ్చితేనె తో కలిపి తీసుకుంటే శరీరంలో ఇన్సులిన్ స్థాయిల్ని క్రమబద్దికరించి మధుమేహ వ్యాధి నివారణలో మందుల ప్రభావం అధికం చేస్తుంది. శరీరంలో వ్యాధి కారకాలను నాశనం చేస్తుంది. బెణుకు, వాపు సమస్యలు చిటికెడు పసుపు, సున్నం, ఉప్పు ల మిశ్రమం చిటికెలో మాయం చేస్తుంది.

Leave a comment