Categories
తీపి, వగరు, పులుపు కలసి చూసేందుకు నిగనిగలాడుతూ నోరూరించే నేరేడు ఆరోగ్యానికి చేసే మేలు ఎంతో వుంది. వేసవి లో విరివిరిగా లభించే ఈ పండు పెద్ద బావుండదు అన్న మాటతో పక్కన పెట్టేస్తే నష్టం. నేరేడు పండులో ఇనుము సమృద్దిగా వుంటుంది. ఇది ఇది రక్తంలో హిమోగ్లోబిన్ శాతం ఎక్కువ చేసేందుకు తోడ్పడుతుంది. వీటిని నిత్యం ఓ పండు లెక్కబెట్టుకుని అయినా తినాలి. వేసవి లో వచ్చే జీర్ణ సంబందమైన సమస్యలు రావు. ఇందులో పుష్కలంగా వుండే విటమిన్-సి వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. గుండె పనితీరును మెరుగు పరిచే పోటాషియం వంటి ఖనిజాలు నేరేడు పండులో ఎక్కువ వున్నాయి. నేరేడు యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్దిగా దొరుకుతాయి. ఇందు వల్ల వృద్దాప్య ఛాయలు దగ్గరికి రాకుండా ఉంటాయి. అధిక బరువు అదుపులో వుంటుంది.