అందమైన పువ్వుల్లో ఎన్నో సౌందర్య పోషకాలు ఉన్నాయి మందార పూలు మేని మెరుపును పెంచుతాయి. కప్పు నీళ్లల్లో మందార పూలు వేసి మరిగించి ఆ నీటిని రెండు స్పూన్ల తేనె కలిపి క్లెన్సర్ గా ఉపయోగించవచ్చు.అలాగే ఈ నీళ్లలో ఓ స్పూన్  పెసర పిండి, కాస్త పంచదార కలిపి మొహానికి రాసుకుంటే మృతకణాలు పోతాయి.చామంతి పువ్వులను నీళ్ళలో మరిగించి ఆ నీళ్లలో స్పూన్ తేనె,స్పూన్ నిమ్మరసం కలిపి ముఖానికి రాసుకుని ఆరనివ్వాలి తర్వాత కడిగేస్తే మొటిమలు మచ్చలు పోతాయి. అలాగే కలువపూలు మెంతి  గింజలను కొబ్బరినూనెలో మరిగించి ఆ నూనెలో బాదం నూనె కలిపి తలకు పట్టించి తలస్నానం చేస్తూ ఉంటే జుట్టుకు పోషణ ఉంటుంది.

Leave a comment