Categories
కోవిడ్ వ్యాక్సిన్ తీసుకునే వారు మానసికంగా కూడా ఆరోగ్యంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు పరిశోధకులు.ఒత్తిడి కుంగుబాటు ఆందోళన లతో సతమతం అయ్యే వారికి బరువు పెరగటం ఇతరత్రా సమస్యలు రావటమే కాకుండా కొవిడ్-19 వ్యాక్సిన్ కూడా సరిగా పని చేయదంటున్నారు. ఈ సమస్యలు ఉన్నవారిలో కోవిడ్ వ్యాక్సిన్ వేసుకున్న తరువాత యాంటీ బాడీలు తగినంతగా పెరగ లేదంటున్నారు. పర్యావరణం జన్యువులు శారీరక మానసిక ఆరోగ్యం అన్ని కలిసి రోగనిరోధక వ్యవస్థని దెబ్బతీస్తున్నాయని వాక్సిన్ ప్రభావం కూడా దాన్ని బట్టే ఉంటుందంటున్నారు వ్యాక్సినేషన్ కు ముందు, వ్యాయామం చేసి మంచి నిద్ర పోతేనే రోగనిరోధక వ్యవస్థ మెరుగై వ్యాక్సిన్ ప్రభావవంతంగా పని చేస్తుందని చెబుతున్నారు.
ReplyReply allForward
|