Categories
భారత దేశంలో తొలి మహిళ బ్యాండ్ గా గుర్తింపు తెచ్చుకొన్న మేరీ జిందగీ బ్యాండ్ కు రూపకర్త లక్నోకు చెందిన జయా తివారీ. పాటల ద్వారా మహిళలలో స్పూర్తి రగిల్చి వారిని విజేతలుగా నిలపాలని ప్రయత్నం .లింగ వివక్ష గృహ హింస ,ఆడపిల్లల చదువు, బాల్య వివాహలు మొదలైన, మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలే వీరి పాటలు . జయ బృందంలో ఆమెతో పాటు నిహరికా దూబె, పూర్వీ మాల్వీయ ,అనామికా ఝం ఝన్ వాలా, సౌభాగ్య దీక్షిత్ ఉన్నారు. ఇప్పుటి వరకు వంద వేడికలపైన ఈ బృందం పాటలు పాడారు. సంగీతంతో సామాజంలోని రుగ్మతలను పోగొట్టటం ఈ బృందం లక్ష్యం.