Categories
రెడీమేడ్ కోన్స్ డిజైనింగ్ రంగం వచ్చేసి, గోరింటాకు రుబ్బి అరచేతుల్లో పెట్టుకునే అలవాటును దూరం చేసింది. గోరింటాకులో సౌందర్య ప్రయోజనాలు ఎన్నో వున్నాయి. ముఖ్యంగా జుట్టు రాలటాన్ని ఆపగలిగే గోరింటాకును మెత్తని పేస్టులా రుబ్బి, ఇందులో నిమ్మరసం, పెరుగు కలిపి తలకు పెట్టుకుంటే ఎంతో ఆరోగ్యం. రెండు వారాలకోసారి ఇలా చేయవచ్చు. అలాగే ఆవనునేలో గోరింటాకు వేసి కాచి ఆరాక ఆ నూనెను గాజు సీసాలో బద్రం చేసుకుని వాడుకోవాలి. ఈ జుట్టు తో మాడుకు మర్దనా చేసి కాసేపు వదిలేసి తలస్నానం చేసేయచ్చు. ఇలా చేస్తే జుట్టు రాలడం ఆగిపోతుంది. అలాగే మెంతులు, ఆవనునే, గోరింటాకు కలిపి పేస్టూ చేసి ఆ మెంటు పిండిని తలకు పట్టించి, ఆరాక తలస్నానం చేస్తే జుట్టు పట్టులా మెరిసిపోతుంది.