Categories
కంప్యూటర్ పైన ఎక్కువ గంటలు పని చేయడం వల్ల కళ్ళ ఆరోగ్యం దెబ్బ తింటుంది. కళ్ళ చుట్టు దెబ్బతింటుంది.కళ్ళ చూట్టు వలయాల్లో వయసు ప్రభావం చూపించే ఉబ్బులు వస్తాయి. నయన సౌందర్యం కాపాడుకునేందుకు కొన్ని సూచనలుచేస్తున్నారు ఎక్స్ పర్ట్స్. ప్రతి రాత్రి మేకప్ తొలగించుకోవాలి తడి కాటన్ ఊల్ లో నెమ్మదిగా తడవాలి. తడి దూది పై క్లెన్సర్ వేసుకోవాలి. కాజల్ మస్కారాల్ను జాగ్రత్తగా తుడవాలి. బాదం గింజలు గుజ్జుగా చేసి కళ్ళ కిందరాసి పది నిమిషాల తర్వాత గోరు వెచ్చని నీటితో కడిగేయాలి.మంచి బాదం నూనె కళ్ళ చుట్టు రాసి తేలిగ్గా మసాజ్ చేయాలి. కళ్ళ కింద అప్లయ్ చేస్తూ వుంటే పొడిబారటం నల్లని వలయాలు పోతాయి.