Categories
టాటూల ఫ్యాషన్ ఎంతో ఇష్టమైపోయిందంటే ఇవి వంటిపైనే కాకుండా జుట్టు మీదకీ వచ్చి చేరాయి. సాధారణంగా క్లిప్సులు ,హెయిర్ బ్యాండ్లు పెట్టాలంటే దానికి తగ్గ హెయిర్ స్టైల్ ఉండాలి. ఈ టాటూ హెయిర్ బాండ్స్ అయితే అంటిస్తే సరిపోతుంది. మెరిసే బంగారం ,వెండి రంగులతో పాటు ఇతర వర్ణాల, అంటించే టాటూలు వచ్చాయి. ఇవి జుటుకు ఆభరణాలు లాగా ఉంటాయి. జడబిళ్లల్లా ఆరభోసిన కురులకు హెయిర్ క్లిప్పుల్లాగా ఈ టాటూలు రాత్రిళ్ళు మెరిసిపోతాయి. కొత్త దనం కోరుకొనే అమ్మాయిలు జుట్టుకు అలంకరం కోసం ఈ ఫ్యాషన్ టాటూలను ఇష్టంగా అలంకరించుకొంటున్నారు. ఇవి క్లిప్పుల్లాగా తలకు పెట్టుకొనే ఆభరణాల్లాగా చాలా బావుంటాయి.