Categories
ఫిదాలో నటించిన గాయత్రీ గుప్తా తనను సినీపరిశ్రమలో కొందరు వేధిస్తున్నారని గొంతు విప్పింది. నేను షార్ట్ ఫిలిమ్స్, ఫీచర్ ఫిల్మ్ లో నటించాను, పాటలు పాడతాను, కథలు రాస్తాను. ఒక చిత్రంలో ఒప్పుకున్న సమయం నన్నేంతో ఇబ్బంది పెట్టింది. పరిశ్రమలో అన్నీ జరిగిపోతాయి .బయటికి పొక్కవు. పోలీసు స్టేషన్ కు వెళ్ళాలంటే ఆధారాలు కావాలి ఇలాంటివి వింటే సినీ పరిశ్రమలో అమ్మాయిలు రావటానికి భయపడతారు. నన్ను చాలా మంది వలలో వేసుకొనే ప్రయత్నం చేశారు. తిండి కంటే ఆత్మగౌరవం చాలా ముఖ్యం . ఆ ఆత్మగౌరవమే మమ్మల్ని ,అందరినీ కాపాడుతోందని నేను నమ్మాను అంటోంది గాయత్రి గుప్తా. భూమి పుట్టినప్పటి నుంచి వినిపిస్తున్నాయి ఇలాంటి కథలన్నీ మరి అంతం ఎప్పటికో ?