Categories
ప్రపంచంలో ఒకే రంగును ఎంచుకున్నందుకు కాను కొంతమంది మహిళలు ప్రసిద్ధికెక్కారు స్విట్జర్లాండ్ కు చెందిన యాస్మిన్ కూడా అలాగే పింక్ కలర్ ఎంచుకుంది. ఆమె వృత్తిరీత్యా ఉపాధ్యాయురాలు ఆమెను మిస్ పింక్ అని పిలుస్తారు. 12 సంవత్సరాల వయస్సు నుంచే పింక్ రంగు పట్ల వ్యామోహం పెంచుకున్నారు యాస్మిన్ చార్లెట్. పింక్ కలెక్షన్ మొదలుపెట్టింది పెళ్ళయ్యాక భర్త కూడా అందుకు అడ్డు చెప్పలేదు. 2019 లో సొంత ఫ్లాట్ కొనుక్కుని ఇల్లంతా పింక్ షేడ్ లోకి మార్చేసింది.20 ఏళ్లుగా ఆమె గులాబీ రంగు దుస్తులు తప్ప ఇంకో రంగు ధరించలేదు దోస్తులు షూస్ ఇంటి అలంకరణ మొత్తం ఒకే రంగు పింక్ రంగు కారణంగానే యాస్మిన్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతుంది.