మిస్ ఇండియా,మిస్ యూనివర్స్ లాగా మిస్ వరల్డ్ డైవర్సిటీ పోటీలు మరిషస్ లో జరిగాయి. ట్రాన్స్ జెండర్ల కోసం నిర్వహించిన ఈ పోటీలు మిస్ వరల్డ్ డైవర్సిటీ గా భారత్ కు చెందిన నాజ్ జోషి కిరీటం గెల్చుకుంది. ప్రపంచంలోని వివిధ దేశాల వాళ్ళు పాల్గొనే ఈ పోటీలో అందాల కిరీటాన్ని ఈమె వరసగా మూడోసారి గెలుచుకొంది. సమాజంలో లింగ వివక్ష రూపు మేపేందుకు కృషి చేస్తానని నాజ్,ఇళ్ళలో పని మనిషిగా పనిచేస్తూ లైంగిక హింసకు గురయ్యానని చెపుతోంది.