కోల్ కత్తా కు చెందిన అలీన ఆలమ్ 2017లో దేశ్ పాండే ఫౌండేషన్ సాయంతో బెంగళూరులోని బీవీచి ఇంజనీరింగ్ కాలేజీలో మిట్టీ కేఫ్ ప్రారంభించింది. ఈ కేఫ్ లో పనిచేసే వాళ్ళందరూ వికలాంగులు. రకరకాల వైకల్యాలు గల వారు సక్రమంగా పని చేయగలిగేందుకు  ప్రత్యేకమైన  సౌకర్యాలుంటాయి. ఈ కేఫ్ లో మెనూ కార్డ్ బ్రెయిలీ లిపి లో ఉంటుంది. ఫుడ్ ఆర్డర్ ఇచ్చేందుకు కస్టమర్స్ పిలవగానే లైటింగ్ తో మెరిసే ఫ్ల కార్డులు   వెయిటర్లను  అలెర్ట్ చేస్తాయి. వినికిడి లోపం, డౌన్ సిండ్రోమ్, దృష్టిలోపం, శారీరక వైకల్యం కలిగిన వారే కేఫ్ పనులన్నీ చక్క పెడతారు. మిట్టీ కేఫ్ లో 116 మంది ఉద్యోగులున్నారు. వికలాంగుల కోసం ఇంతగా కృషి చేసిన అలీనా ఫోర్బ్స్ 30 అండర్ 30 జాబిదా లో చోటు దక్కించుకోవటమే గాక  సక్సెస్ ఫుల్ యువ్ ఎంట్ర ఫ్రెన్యుర్ గా నిలుస్తోంది.

Leave a comment