Categories

అంతరిక్షం లోకి ప్రయాణం చేసిన తొలి అమెరికన్ మహిళగా చరిత్ర సృష్టించారు సాలీ రైడ్. కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం లో సైన్స్ బోధించారు. ఎందరో బాలికలను సైన్స్ దిశగా ప్రోత్సాహించారామె. ఆమె బోధించిన ఉపగ్రహాల సిద్ధాంతాలను ఆ తర్వాత కాలంలో చేపట్టిన అంతరిక్ష పరిశోధనల్లో ఉపయోగించారు. సాలీ రైడ్ బాలికలకు అంతరిక్ష శాస్త్రాన్ని అధ్యయనం చేసేందుకు దోహదపడే కార్యక్రమాలు రూపొందించారు.