ఏదైనా వ్యాపారం చేయాలంటే ముందు అధ్యయనం చేయాలి. ఆలా లండన్ లో పని చేస్తున్న గీతాంజలి రాజమణి భారత్  వచ్చి బెంగుళూరు లోని గ్రీన్ మై లైఫ్ సంస్థను డిజైన్  చేసే ముందర గార్డెనింగ్ పైన పట్టు సాధించాలి. ఇక వ్యాపారంలో దిగి హోటళ్లు రిసార్ట్ లు ,ఇళ్లలో మొక్కల్ని ఏర్పాటు చేస్తారు. ల్యాండ్ స్కేపింగ్ ,కిటన్ గార్డెన్ ల తో సరి పెట్టుకోకుండా రైతుల కోసం విత్తనాలు మొక్కలు క్యాష్ ఆన్ డెలివరీ చేస్తారు. కూరగాయలు పండ్లు ఉద్యానవన పంటలు అంతర పంటలకు సంబంధించి 400 రకాల విత్తనాలు రైతుల కోసం పంపిణీ చేస్తారు. ప్రత్యక్షంగా రైతులను కలిసి మంచి విత్తనాలు సేకరించి గిట్టు బాటు ధర చెల్లిస్తారు. ఇలాంటి వాళ్ళను తలుచుకుంటే ఏదైనా కొత్త పని చేయాలనిపిస్తుందేమో కదా !

Leave a comment