టీనేజ్ రాగానే మొదలయ్యే సమస్య మొటిమలు. హార్మోన్ల అసమతుల్యత, జీవన శైలి, పోషకాల ప్రభావం కూడా ఒక కారణం. శరీరం లోని మేల్ హార్మోన్లు ఎక్కువ నూనె వుత్పత్తి చేయడం వల్ల చర్మ రంధ్రాలు ముసుకుపోయి బాక్టీరియాను ఆకర్షించె మొదటి కారణం అవ్వుతుంది. మొటిమలు ఎర్రగా చీము పట్టినట్లు ఉంటాయి. టీనేజర్లకు సహజంగా మొటిమలు వస్తాయని వాటికి చికిత్స చేయవలసిన అవసరం లేదనుకుంటే అపోహే. నిజానికి ముందు దశలో చికిత్స తీసుకుంటే మచ్చలు రందాలు పడవు. పట్టించుకోకుండా వదిలేస్తేనే ఇన్ ఫెక్షన్ పై పోరలకు చేరి పిట్స్, స్కార్స్ పడతాయి. మొహాన్ని క్లీన్ గా ఉంచుకుని అవసరమైన జెల్స్ వాడాలి. ముఖాన్ని పదే పదే కడుగుతుంది చర్మం పొడిబారి పోయి అదో సమస్య అవ్వుతుంది. 16 ఏళ్ళు వచ్చాక మొహం పై వీపు పై కూడా మొటిమలు కనిపిస్తే వెంటనే వాటిని చికిత్స చేయడం మంచిది.
Categories