Categories
ఆముదం జిడ్డుగా కాస్త చిక్కగా ఉంటుంది కానీ చర్మ,శిరోజాల పరి రక్షణలో మాత్రం ముందుంటుంది. చర్మం కాలినా,కమిలినా ఆముదంలో తడిపిన దూదిని ఆ ప్రదేశంలో ఉంచి గంట తరువాత కడిగేస్తే చాలా త్వరగా తగ్గుతుంది.కళ్ళ కింద ఆముదంతో మసాజ్ చేస్తే ముడతలు తగ్గి చర్మం మెరుస్తూ వయసూ కనబనీయదు. ఆముదంలోని రిసి నోలియాక్ ఆమ్లం,మొటిమలకు కారణమైన బాక్టిరీయాని నాశనం చేస్తుంది. గర్భం ధరించినప్పుడు పొట్ట పైన పడిన చారల పైన ఆముదం రాస్తూ ఉంటే తగ్గిపోతాయి. తలకు పట్టించి కాస్త మసాజ్ చేసి తలస్నానం చేస్తే జుట్టు పెరగడంతోపాటు తలకు ఇన్ ఫెక్షన్లు తగ్గుతాయి.