Categories
సన్ గ్లాసులు ఇపుడు కళ్ళకు రక్షణే కాదు. ఓ స్టైల్ స్టేట్ మెంట్ కూడా పెట్టుకొనే సన్ గ్లాస్ మొహనికి నొప్పితేనే ఫ్యాషన్ యాక్ససరీ అవుతోంది. ముఖాకృతిని బట్టి సరైన సన్ గ్లాస్ ఎంచుకోవాలి. ముఖం గుండ్రంగా వుంటే రెక్టాంగ్యాలర్ ఫ్రేమ్ నప్పుతోంది . గుండ్రని మొహం గలవారికి మొహం,వెడల్పు పొడవు సమంగా ఉంటుంది. కనుక ఈ రెక్టాంగ్యాలర్ ఫ్రేమ్ గుండ్రని ఆకృతిని కొంత తగ్గించి మొహం పొడవుగా ఉన్నట్లు చూపుతోంది. అంతే కాకుండా మొహం స్లిమ్ గా ఉన్న బ్రాంతిని ఇస్తూ ఫోకస్ ను ముఖాకృతి నుంచి మళ్ళిస్తూ వుంటాయి ముఖం ఏ షేప్ లో వుంటే ఏవి నొప్పుతాయో ఒకచిన్న అవగాహనా ఉంటే సరైన సన్ గ్లాసులు ఎంపిక చేసుకోవచ్చు.