Categories

చక్కని చర్మం రంగు ,ముక్కు మొహం అందంగా ఉన్నా చుట్టు ఉంటే వాతావరణ కాలుష్యానికి చర్మం మెరుపు పోయి మొటిమలు ,మచ్చలతో కాంతి లేకుండా తయారవుతుంది. ఒక్కసారి ఖరీదైన ఫేస్ ప్యాక్ లు కూడా ఫలితం చూపెట్టకుండా ఉంటాయి. ఇంట్లో ఉండే సహాజమైన వస్తువులతో తయారు చేసిన ఫేస్ ఫ్యాక్ ఎంతో మంచి ఫలితం ఇవ్వగలుగుతోంది. కీర దోస ,శనగ పిండి నిమ్మ రసం పెరుగు పసుపు తేనే కలిపి మొత్తగా ఫేస్ట్ లాగా చేయాలి. చల్లని నీళ్ళతో మొహం శుభ్రంగా కడుక్కోని ఈ ఫేస్ ప్యాక్ ని మొహనికి వేసుకొని ఆరనివ్వాలి .ఇరవై నిమిషాల తర్వాత గోరు వెచ్చని నీళ్ళతో మొహం శుభ్రం చేసుకుంటే ఫలితం తెలుస్తుంది. వారానికి రెండు మూడు సార్లు ఇలా చేస్తే చాలు.