నందిని భావ్మిక్ కలకత్తాలోని ఓ మహిళా పురోహితురాలు. పదేళ్ళ నుంచి మంత్రులతో పూజలు ,శుభకార్యాలు చక్కగా జరిపిస్తారు అంతే కాదు కన్యాదానం ఘట్టం లేని వివాహం జరిపిస్తుంది ఈమె. వివాహంలో కన్యాదానం ముఖ్యమంటారు కానీ ఇది అర్థం లేనిదని ,అమానుషమని ఆడపిల్లను ఒక బొమ్మాలాగా దానం చేయటం ఏమిటని ప్రశ్నించి ఆ కన్యాదానం ఘట్టాన్ని వివాహతంతుల్లోనే తీసేసింది నందినీ .కులాంతర ,మతాంతర వివాహాలు జరిపించే నందినికి పౌరోహిత్యం వృత్తి కాదు జాదవ్పూర్ విశ్వవిద్యాలయంలో సంస్కృత పండితురాలుగా పనిచేస్తుంది.

Leave a comment