Categories
డిజర్ట్ లు తినటం ఇష్టమైతే అవి తినే పద్దతి మార్చుకొంటే బరువు పెరగుతామనే భయం అక్కర్లేదు అంటున్నారు పరిశోధకులు. డిజర్ట్ కు భోజనం తర్వాత కాకుండా భోజనం ముందర తినాలి. చక్కెర అధికంగా ఉండే పదార్ధాలు ఎనటైటిస్ ను కొంత నియంత్రణలో ఉంచుతాయి. బరువు తగ్గాలనుకొనే వారు భోజానికి కంటే ముందు గ్లూకోజ్ అధికంగా ఉండే పదార్ధాలు తినటం వల్ల మెదడుకు శరీరానికి శక్తి సరిపోయిందన్న సంజ్ఞ అందుతోంది. ఫలితంగా అదనపు క్యాలరీలు తీసుకోలేకపోతారు. దీని వల్ల ఎక్కువ తినే చాన్స్ ఉండదు.