పట్టు చీరెలు పేరు చెబితే కంచితో పాటు గుర్తోచ్చేది అనంతపురం జిల్లా ధర్మవరం. అసలు పట్టు చీరెకు భౌగోళిక నేపథ్యం రావడం వెనక ధర్మవరం నేతకారుల కృషి డిజైన్ల గొప్పతనమే కారణం.గాఢమైన రంగులతో పెద్ద పైటకొంగు అంచుతో ఉండటం ఈ చీరెలకు గొప్ప అందం తెచ్చి పెడుతుంది.ధర్మవరం ముత్యాల పట్టు చీరెలతో సరికొత్త డిజైన్ ను సృష్టించారు ధర్మవరం నేతన్నలు.ఒక్క చీరెలో 800 ముత్యాలకు పైగ పొదిగి చేసిన ఈ చీరె ఖరీదు 30 వేలు పై మాటే. చక్కని రంగులు అందమైన కొంగులతో ధర్మవరం పట్టు చీరెలు శుభకార్యాలకు మరింత అందం తెస్తాయి.