ముత్యాలు ఎప్పుడు అందమైన నగల్లో భాగంగానే ఉంటూ వచ్చాయి . వజ్రాలు ,కెంపులు నగలైన ముత్యాలతో చేస్తేనే అందంగా ఉంటుంది . ముత్యాల ఉంగరం ప్రేమకు సంకేతంగా ఇస్తూ వుంటారు .అలాంటి చిన్న ముత్త్యాలు ఇప్పుడు గోళ్ళకు ఆలంకారాలుగ వచ్చాయి . గోళ్ళ పై ముత్యాల వరుసలు తీర్చిదిద్దటం నెయిల్ ఆర్ట్ లో కొత్త ట్రెండ్ . ముత్యాలు నెయిల్ పాలిష్ లో వచ్చాయి .ముత్యా0ల రంగుతో గోళ్ళు ఆలంకరించు కోవటం అయింది. సన్నటి ముత్యాల డిజైన్లు గోళ్ళకు అలంకరించటంతో అచ్ఛంగా ఒక ప్రత్యేకమైన ఆభరణం తగిలించినట్లే ఉన్నాయి . ఈ ముత్యాల నెయిల్ ఆర్ట్ లో గోళ్ళు మొత్తంగా ముత్యాలు అతికించి మూలల్లో పూవుల్లాగ పొదిగే డిజైనర్లు ముత్యాల విలువనీ పెంచేశారు.

Leave a comment