కరోనా కష్టం మనుషులందరినీ దగ్గర చేసిందనటంలో సందేహం లేదు.ఈ విపత్తును ఎదురుకొనేందుకు,ధనికులు పేదలు తారతమ్యం లేకుండా తోటి వారిని ఆదుకొనే బాధ్యత అందరు తీసుకొన్నారు. తోచిన సహాయాన్ని చేస్తూ వస్తున్నారు దేశాధ్యక్షుడు రామనాథ్ కోవింద్ సతీమణి సవితా కోవింద్ మాస్క్ లు కుట్టటం మొదలు పెట్టారు. ఆమె కుట్టిన మాస్క్ లు ఢిల్లీ లోని షెల్టర్ హోమ్స్ కు పంపిణీ చేస్తున్నారు.